సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ హవా జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ నటులు, దర్శకులు, సంగీత దర్శకుల వారసులు వరుసగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తమ తల్లిదండ్రుల లెగసీని కొనసాగించడమే కాకుండా, కొత్త పుంతలు తొక్కుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మరో ప్రతిభావంతుడు చేరబోతున్నాడు.ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ తనయుడు హర్షవర్ధన్ సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నారని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించి, తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న విద్యాసాగర్ ప్రస్తుతం కూడా పలు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఆయన కుమారుడు హర్షవర్ధన్ చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి కనబరుస్తూ, సంగీత కచేరీల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల నటనపైనా ఆసక్తి పెంచుకొని, తన డెడికేషన్‌తో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.


ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. లింగస్వామి దర్శకత్వం అంటేనే యాక్షన్, ఎమోషన్, స్టైల్ కలబోత అని అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త చిత్రం రోడ్డు ట్రావెలింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందట. కథలో భావోద్వేగాలకు, సస్పెన్స్‌కి, యాక్షన్ సన్నివేశాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.హీరో హర్షవర్ధన్ సరసన ప్రస్తుతం సౌత్‌లో సంచలనం సృష్టిస్తున్న నటి రుక్మిణి వసంత్ ని హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. రుక్మిణి ఇటీవల ‘మదరాసీ’ మరియు ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమాలతో వరుస విజయాలను అందుకుని, ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఆమెకు ఈ కథను వివరించగానే ఎంతో ఇష్టపడి నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రుక్మిణి గ్లామర్‌తో పాటు నటనలోనూ సత్తా చాటిన నటి కావడంతో, హర్షవర్ధన్‌తో ఆమె జోడీ బాగా సెట్ అవుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.



ఇదే సమయంలో, ఈ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. హర్షవర్ధన్ కోసం ప్రత్యేక యాక్షన్ ట్రైనింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్, లుక్ టెస్టులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయట. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఆయనను ఒక కొత్త తరహా హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు లింగస్వామి భావిస్తున్నాడు.త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం బహుభాషా స్థాయిలో విడుదల కానుందని, మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు.ఇక ఈ వార్త తెలుసుకున్న విద్యాసాగర్ అభిమానులు, సంగీతప్రియులు మరియు సినీ ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. “తండ్రిలా కొడుకు కూడా ఇండస్ట్రీలో సత్తా చాటుతాడనే నమ్మకం ఉంది. హర్షవర్ధన్‌కు ఇది లైఫ్-చేంజింగ్ ఛాన్స్ అవుతుంది” అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది ఒకరు పోతే ఒకరు ఇలా వారసత్వం పేరుతో ఇండస్ట్రీలో కి వస్తూనే ఉంటారా..? అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: