టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా సినిమా చేసి చాలా కాలమే అవుతుంది. ఆఖరుగా నాగార్జున హీరోగా నా సామి రంగ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు నాగార్జున ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నా సామి రంగ సినిమా తర్వాత నాగార్జున హీరోగా సినిమాలు చేయకపోయినా వేరే హీరోలా సినిమాలలో మాత్రం నటించాడు. నా సామి రంగ సినిమా తర్వాత నాగార్జున , ధనుష్ హీరోగా రూపొందిన కుబేర సినిమాలో కీలక పాత్రలో నటించగా ... రజిని హీరోగా రూపొందిన కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే నాగార్జున ప్రస్తుతం తన 100 వ సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా నాగార్జున ఓ దర్శకుడితో తన 100 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే నాగర్జున 100 వ సినిమాకు సంబంధించి భారీ అప్డేట్లు ఏమీ రాకపోయినా ఈ సినిమాలో నాగార్జున సరసన చాలా మంది హీరోయిన్లు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం నాగార్జున 100 వ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కి రోల్ లో కనిపించనున్నట్లు , అనుష్క శెట్టి , సుష్మిత బట్ ఈ మూవీ లో హీరోయిన్లుగా కనిపించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా రూపొందిన కింగ్ మూవీలో అనేక మంది హీరోయిన్లు కనిపించారు. అదే రేంజ్ లో నాగార్జున 100 వ సినిమాలో కూడా చాలా మంది హీరోయిన్లు కనిపించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: