ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమాకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే అందులో ఎల్లమ్మ సినిమా కూడా ఉంటుంది. ప్రముఖ కమెడియన్ వేణు కొంత కాలం క్రితం ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా బలగం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత మంచి టాకు వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేస్తాడు ..? ఎలాంటి సినిమా చేస్తాడు ..? అనే వార్తలు జనాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అలాంటి సమయం లోనే వేణు నాని హీరోగా దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ అనే టైటిల్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అంత ఓకే అయ్యింది అనే లోపే నాని ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నాడు అని వార్తలు వచ్చాయి. నాని ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు అని వార్తలు వచ్చాక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నాడు. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అని వార్తలు వచ్చాయి.

ఈ కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుంది అనుకునే లోపు నితిన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ లో హీరో గా నటించే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అయింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ లో హీరో గా నటించిన కూడా దిల్ రాజు చాలా కాలం క్రితమే ఎల్లమ్మ సినిమాకు మ్యూజిక్ అందించడానికి అజయ్ అతుల్ కి అడ్వాన్స్ ఇచ్చాడు అని దానితో దేవి శ్రీ ప్రసాద్ సినిమాలో హీరోగా నటించిన అజయ్ అతుల్మూవీ కి సంగీతం అందిస్తారు అని వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ "ఎల్లమ్మ" సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకు సంగీతం కూడా అందించబోతున్నట్లు ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. మరి ఎల్లమ్మ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారో ..? ఎవరు ఈ సినిమాకు సంగీతం అందిస్తారో ..? తెలియాలి అంటే ఈ మూవీ బృందం అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: