ఏంటి ఆ డైరెక్టర్ నిజంగానే సుమని అంత పెద్ద మోసం చేశారా.. అంత మోసం చేయకపోతే సుమ కేసు పెడతానని ఎందుకు అంటుంది.. నిజంగానే సుమని నమ్మించి మోసం చేశారా అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా సుమ ప్రేమంటే మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడిపై సంచలన కామెంట్లు చేసింది.నన్ను డైరెక్టర్ నమ్మించి మోసం చేశారు..ఈ విషయంలో నేను డైరెక్టర్ పై కేసు పెట్టాల్సిందే కానీ వెనక్కి తగ్గాను అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ డైరెక్టర్ పై కేసు పెట్టాల్సిన అవసరం సుమకి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. సుమ జయమ్మ పంచాయతీ అనే మూవీ తర్వాత ప్రేమంటే అనే మూవీతో మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి.. హీరోయిన్ గా ఆనందిలు నటిస్తున్నారు. అయితే తాజాగా ప్రేమంటే మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. 

ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో సుమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఆమె మాట్లాడుతూ.. ఏంటో ఎప్పుడూ అందరినీ నేనే పలకరించే దాన్ని..అన్నింటికీ నేనే హోస్ట్ గా చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నా ప్లేస్ ని గీత కొట్టేసింది. నా చెక్ ని కూడా కొట్టేసింది అంటూ రావడంతోనే అక్కడున్న వారందరినీ నవ్వులు పూయించింది. అలాగే ప్రేమంటే మూవీలో హీరోయిన్గా మొదట నాకే ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ నేనే హీరోయిన్ అని ఇందులోకి తీసుకోవచ్చారు. కానీ చివరికి నన్ను పక్కన పెట్టి ఆనందిని తీసుకున్నారు. ఎందుకంటే ప్రియదర్శి కంటే వయసులో నేను చాలా చిన్నదాన్ని. ఇద్దరికీ జోడి సెట్ అవ్వదని నన్ను పక్కన పెట్టారు. ఆనందిని తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో నేను కూడా గ్లామర్ గానే కనిపించాను. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ మొదట నన్ను హీరోయిన్ అన్నారు.

ఆ తర్వాత ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు అని చెప్పారు. కానీ ఒక సీన్ షూట్ చేశాకే అసలు విషయం అర్థమైంది.ఏంటంటే..అసలు ఈ సినిమాలో పవర్ లెస్ కానిస్టేబుల్ పాత్ర అని.. ఇదంతా అర్థమై నేను దర్శకుడి పై కేసు నమోదు చేద్దామని అనుకున్నాను. కానీ చివరికి డైరెక్టర్ ఇంకా కుర్రాడే కదా పెళ్లి కూడా కాలేదు అనుకున్నాను.. ఇక పెళ్లికి మించిన కేసు ఏముంటుంది.. అలాగే ఈ సినిమాలో నేను పాటకి డాన్స్ చేశాను. అందులో హూక్ స్టెప్ మీరందరూ చేయాలి. ఇందులో హీరోయిన్ కంటే నేను గ్లామర్ గా కనిపించాను అంటూ తన ఫన్నీ ఫన్నీ మాటలతో అక్కడున్న వారందరికీ నవ్వులు పుట్టించింది. ఒక్కసారి సుమ రంగంలోకి దిగాక ఎవరైనా సరే కడుపుబ్బా నవ్వాల్సిందే అన్నట్లు మరోసారి రుజువు చేసింది. అలా యాంకర్ అయినా యాక్టర్ అయినా సుమ రానంతవరకే అన్నట్లు ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: