బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నిజానికి ఇది కే ర్యాంపే . వరుసగా మంచి విజయాలతో దూసుకుపోతున్నారు మా తమ్ముళ్లు రాజేష్, శివ అంటూ తెలిపారు. వార్నింగ్లు అనేవి ఇండస్ట్రీలో వర్కౌట్ కావు, రాజకీయాలలో అవుతాయి అంటూ.. ఈరోజు ఒక కుర్రాడు గురించి చెప్పాలి రాయచోటి అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి బెంగళూరులో ఉద్యోగం వదిలేసి హీరో అయ్యాడు. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి! మీ అమ్మానాన్నల కోసం మీ కలలను వదిలేయకండి, ఒక సినిమా హిట్ అవ్వగానే.. హే వాట్సాప్ వాట్సాప్ అంటూ కాలు మీద కాలేసుకుంటున్న ఈ రోజులలో హిట్టు మీద హిట్టు కొడుతున్న నా ఇంట్లో కుర్రాడిలా ఉన్నారు కిరణ్ అబ్బవరం అంటూ తెలిపారు.
కిరణ్ అబ్బవరం ని చూస్తూ ఉంటే చిరంజీవి గారే గుర్తుకు వస్తున్నారని. రాబోయే రోజుల్లో భారతరత్న కూడా మెగాస్టార్ తీసుకోబోతున్నారు. నువ్వు మెగాస్టార్నే ఆదర్శంగా తీసుకో, కిరణ్ అబ్బవరంతో పనిచేసిన ప్రతి డైరెక్టర్ కూడా కొత్త దర్శకుడు ఒక సినిమా హిట్ అయితే లోకేష్ కనకరాజును తీసుకురా, రాజమౌళిని తీసుకురా, సుకుమారిని తీసుకురా అంటూ చాలామంది అంటూ ఉంటారు. కానీ కిరణ్ అబ్బవరం చూసి నేర్చుకోవాలి అంటు తెలియజేశారు. కిరణ్ అబ్బవరం వరుసగా 6 మంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశారు.. అలాంటి ధైర్యం, ఖలేజా ఉన్నాడే ఈ కుర్రాడు. కే ర్యాంప్ అంటే ఇది అంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి