టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎన్నో విజయాలను అందుకొని అత్యంత తక్కువ కాలం లోనే తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం రష్మిక కమర్షియల్ సినిమాలలో నటిస్తూ వస్తూనే మరో వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను నవంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యొక్క రన్ టైం ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ /ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని 2 గంటల 18 నిమిషాల 34 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రష్మిక "ది గర్ల్ ఫ్రెండ్" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm