దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తో వైరల్ అయిన దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశం కూడా అందుకుంది.అయితే అలాంటి దివ్వెల మాధురి హౌస్ లోకి వెళ్లడంతోనే తన మాట తీరుతో చాలా నెగిటివ్ అయిపోయింది.కానీ ఆ తర్వాత పోను పోను దివ్వెల మాధురిని చాలా మంది ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో టాలెంటెడ్ ప్లేయర్ అయినటువంటి తనూజకి చాలా దగ్గరయిపోయింది. అలా హౌస్ లోకి వెళ్లిన కొత్తలో తన మాటలతో గట్టిగా అరుస్తూ అందరికి చిరాకు తెప్పించిన మాధురి ఆ తర్వాత మాధురి లేకపోతే హౌస్ ఇంత రసవత్తరంగా ఉండదు అనేలా మారిపోయింది.కానీ ఫైనల్ గా వైల్డ్ కార్డు ద్వారా వెళ్లిన మాధురి హౌస్ లోకి వెళ్ళిన మూడు వారాలకే తిరిగి వచ్చేసింది. అయితే బిగ్ బాస్ నుండి తిరిగి వచ్చాక కొంత మంది యూట్యూబర్ లు ఆమె దగ్గరికి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. వాడు అసలు మనిషే కాదు.. ఓ అమ్మకి అబ్బకి పుట్టలేదంటూ రెచ్చిపోయింది. మరి మాధురి ఎందుకు ఆ మాటలు మాట్లాడింది.. అనేది చూస్తే రీతు పవన్ ల బాండింగ్ గురించి ఎందుకు మీరు అలా అని హెల్దీ బాండ్ అని చెప్పారు అంటే..నాకు అలా అనిపించింది.నేను చెప్పాను.అలాగే రీతు తల్లి నా దగ్గరికి వచ్చి చెప్పి ఏడ్చింది.పవన్ కి దూరంగా ఉండమని అందుకే అలా అన్నాను అని చెప్పింది. మరి మీది శ్రీనివాస్ ది కూడా అన్ హెల్దీ బాండింగేనా అని యాంకర్ అడగగా.. మీకు అవన్నీ అవసరం లేదు అంటూ మండిపడింది.

 ఆ తర్వాత భరణి గారితో మీరు డాన్స్ చేసింది.. మాట్లాడిన ఫోటోలపై,వీడియోలపై మీమ్స్ క్రియేట్ చేశారు.. దానిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. ఎవడో బుద్ధిలేని ఎదవనే ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేస్తాడు. వాడు  ఓ అమ్మకి అబ్బకి పుట్టి ఉండడు. నీచాతి నీచమైన బతుకువాడిది.అందుకే అలాంటి మీమ్స్ క్రియేట్ చేశాడు. నేను భరణితో డాన్స్ చేయమని నాగార్జున అడిగితేనే చేశాను. అది కూడా ఎలాంటి టచింగ్స్ లేకుండానే.దురదూరంగానే ఉండి చేశాను. దీనిపై కూడా నెగిటివ్గా రాస్తే వాడసలు అమ్మకు అబ్బకు పుట్టలేదు. అంటూ రెచ్చిపోయి మాట్లాడింది. ప్రస్తుతం దివ్వెల మాధురి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: