అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం నాగవంశీకి ఈ ఫెయిల్యూర్స్‌పై అంతగా టెన్షన్ లేదట. కారణం కింగ్డమ్, మాస్ జాతర లాంటి సినిమాలు థియేటర్లలో నష్టపోయినా, నాన్ థియేట్రికల్ హక్కులు (ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్) రూపంలో మంచి రెవెన్యూ సాధించాయి. దాంతో మొత్తంగా లాస్ పెద్దగా లేనట్టే. అంతేకాదు, ఆయన ప్రొడక్షన్ లైన్‌లో ఉన్న ప్రాజెక్టులే బయ్యర్లకు విశ్వాసం కలిగిస్తున్నాయి. డిసెంబర్లో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న “ఫంకీ” సినిమా పూర్తిగా డిఫరెంట్ జానర్‌లో ఉండబోతోంది. దాని తర్వాత అల్లరి నరేష్ నటించిన ‘ఆల్కహాల్’ జనవరి మొదటి వారంలో థియేటర్లలోకి వస్తుంది. అలాగే సంక్రాంతి సీజన్‌కి నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ కూడా సితార బ్యానర్ నుంచి రానుంది.
ఇవన్నీ కాకుండా సూర్య - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హీరో ట్రాక్ రికార్డు ఏదైనా సరే, ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ వచ్చేసింది. అలాగే అశోక గల్లా, ఆనంద్ దేవరకొండ లాంటి యువ హీరోలతో నాగవంశీ రూపొందిస్తున్న ప్రాజెక్టులు క్రమంగా బజ్ తెచ్చుకుంటున్నాయి. ఇక హారిక & హాసిని క్రియేషన్స్ కింద వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో తయారవుతున్న సినిమా బంగారు బాతు అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అంటే ప్రస్తుత ఫెయిల్యూర్స్ తాత్కాలికమే అంటున్నారు. ఏదేమైనా ఒకటి రెండు ఫ్లాప్స్‌తో నాగవంశీకి వచ్చిన ఇబ్బంది పెద్దది కాదని చెప్పాలి. కానీ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ఆయన దూకుడు కొంచెం తగ్గించడం మంచిదని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి