అల్లు అరవింద్ తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు నెట్టింట సంచలనంగా మారాయి. అంతేకాదు ఇంట్లో వాళ్ళ కంటే బయటి హీరోలే బెటర్ అని ఆయన మాట్లాడిన మాటలు అభిమానుల్లో కాస్త కోపాన్ని పెంచుతున్నాయి. మరి ఇంతకీ అల్లు అరవింద్  ఈ కామెంట్స్ ఎందుకు చేశారు..ఇంట్లో హీరోల కంటే బయటి హీరోలే బెటర్ అని ఆయనకు ఎందుకు అనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న తాజా మూవీ ది గర్ల్ ఫ్రెండ్..ఈ సినిమా నవంబర్ 7న విడుదలవుతుంది. ఇందులో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిన్న రాత్రి జరిగింది.ఇందులో అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన కొంతమంది విలేకరులు ఈ మధ్యకాలంలో ఎందుకు మీరు చిన్న సినిమాలను తీస్తున్నారు. 

మీ గీతా ఆర్ట్స్ కి 50 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి ఈ బ్యానర్ నుండి మిగతా నిర్మాతల లాగా ఎందుకు పెద్ద సినిమాలు రావడం లేదు.చిన్న సినిమాలను ఎందుకు ఎంచుకుంటున్నారు. రిస్కు చేయడం లేదు అనే ప్రశ్న ఎదురయింది. అయితే ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మీరు 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా ఎందుకు తీయడం లేదు అని డైరెక్ట్ గా అడగండి చెబుతాను. సినిమా తీయడం అనేది ఏ నిర్మాతకైనా రిస్కే.. ప్రస్తుతం నేను చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా రిస్క్ ప్రాజెక్టే. అయితే నాకు కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలని ఉంది.

కానీ వారి రెమ్యూనరేషన్లే భారీగా ఉంటాయి. అయితే ఆ రెమ్యూనరేషన్ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంట్లోనే పెడతారు. అలాంటప్పుడు వాళ్లకి రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ డబ్బులు మా ఇంటికే తీసుకొచ్చుకునే బదులు బయట హీరోలకు రెమ్యూనరేషన్ ఇవ్వడం బెటర్ కదా అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ మాటలకి కొంతమంది వెరీ జీనియస్ అంటుంటే..మరి కొంతమందేమో మీ ఇంట్లో హీరోలు వేరే నిర్మాతలతో సినిమాలు చేస్తూ కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ లు తెచ్చి మీ ఇంట్లో పెడతారు.మీరేమో తక్కువ బడ్జెట్ సినిమాలు పెట్టి హీరోలకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: