ఇటీవలే ట్విట్టర్ సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది సెలబ్రిటీలను బూతులు తిడుతూ పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది యూజర్స్ . ముఖ్యంగా హీరోయిన్స్ ఇలాంటి వారి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కొంతమంది అబ్బాయిలు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మరి పచ్చి బూతులు తిడుతున్న విషయాన్ని సింగర్ చిన్మయి సీరియస్గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ను ట్యాగ్ చేసి మరి యాక్షన్ తీసుకోవాలంటూ తెలిపింది.
గౌరవనీయులైన సజ్జనార్ సర్.. దయచేసి ఈ విషయాన్ని గమనించండి నేను ఈరోజు వారి వేధింపులతో విసిగిపోయాను తెలంగాణ మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. వారికి ఎలాంటి విషయమైనా నచ్చకపోతే విమర్శించి వెళ్లిపోవచ్చు, కానీ నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను ఈ కేసు 15 సంవత్సరాలు పట్టినా కూడా చట్టం తన పని తాను చేసుకొని ఇవ్వండి అంటూ.. నా వ్యక్తులు నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు దయచేసి నాకు సహాయం చేయండి అంటు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ద్వారా సింగర్ చిన్మయి సంజనార్ సార్ ను కోరడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్విట్టర్ కూడా వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి