బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల వరకు మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుని ముంబై ఆర్థిక నేరాల విభాగం (EOW ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఇప్పుడు తాజాగా కీలకమైన మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిధులు మళ్లింపులో నలుగురు కీలకమైన వ్యక్తులను EOW అధికారులు గుర్తించారు. రాజ్ కుంద్రా కంపెనీ బెస్ట్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉండేటువంటి ఈ నలుగురు ఉద్యోగులకు సామాన్లు జారీ చేసి ప్రశ్నిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.


అందులో సదరు ఉద్యోగిని ప్రశ్నించిన అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది .మిగతా ముగ్గురు ఉద్యోగులను త్వరలోనే విచారణ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్ కుంద్రా కంపెనీ లావాదేవుల పేరుతో డబ్బులను పక్కదారి మళ్ళించార లేదా? అనే అంశం పైన విచారణ చేపట్టారు. ఈ కేసు జరుగుతున్నప్పటికీ అటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తరచూ విదేశాలకు వెళుతూ ఉండడంతో అధికారులు లుక్ అవుట్ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం. రాజ్ కుంద్రా పేరు మీద ఎన్నో వ్యాపారాలు, క్రీఫ్టో, యాప్ మోసాల కేసులు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఈ రూ .60 కోట్ల కేసులు మరో కొత్త మలుపు తిరుగుతున్నట్లు బాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి.




శిల్పా శెట్టి దంపతులు రూ .60 కోట్లు మోసానికి పాల్పడినట్లుగా ముంబై ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. 2015 నుంచి 2023 వరకు రుణం పెట్టుబడిల రూపంలో రూ. 60.4 కోట్ల రూపాయలు ఈ దంపతులకు ఇచ్చానంటూ తెలియజేశారు. అయితే ఈ డబ్బులను వేరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టుగా కూడా ఆరోపణలు చేశారు. శిల్పా శెట్టి దంపతులను రాజేష్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాము కలిశానంటూ ఫిర్యాదులో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: