టాలీవుడ్ ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే హీరోలలో రానా కూడా ఒకరు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు రానా. ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. అయితే ఇందులో ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా నటించింది. మొదటిసారి ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన అందంతో నటనతో మంచి మార్కులే సంపాదించుకుంది. సినిమా అయితే ఫ్లాప్ అయ్యింది.


ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించగా బాగానే పేరు సంపాదించింది. అలాగే హీరో రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. తాజాగా నిన్నటి రోజున కాంత సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా భాగ్యశ్రీ ఎవరికీ తెలియని విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా తాను లుక్ టెస్ట్ కోసం చెన్నైకి వెళ్లానని అక్కడ తన లుక్ టెస్ట్ చూసి హీరో రానా హీరోయిన్ నచ్చలేదని అన్నారని, కానీ అమ్మాయి బాగుంది చూడడానికి తప్ప యాక్టింగ్ తెలియదంటూ చెప్పారని తెలిపింది భాగ్యశ్రీ బోర్సే.


మొదట కాంత సినిమాకి తనని తీసుకోలేదు.కానీ సెల్వ చాలా నమ్మకంగా ఉన్నారు. నేను చెప్పిన డైలాగ్స్ ,సీన్స్ చేశాక అందరూ కూడా ఆనందపడ్డారు నేను కుమారిగా నటించగలిగానని నమ్మారంటూ తెలిపింది భాగ్యశ్రీ బోర్సే. ఈ అవకాశం ఇచ్చిన రానాకు కూడా తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తెలిపింది. నేను విన్నటువంటి మొట్టమొదటి కథ కాంత ఈ ప్రాజెక్టు నాకు చాలా స్పెషల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని తెలియజేసింది. మరి కాంత సినిమా, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంటుందేమో చూడాలి భాగ్యశ్రీ బోర్సే.

మరింత సమాచారం తెలుసుకోండి: