ఇప్పటికే జాన్వీ, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ సరసన “దేవర” సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె మరో భారీ ప్రాజెక్ట్ — రామ్ చరణ్ – బుచ్చి బాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది పెద్ద బడ్జెట్, భారీ అంచనాలు ఉన్న సినిమా. అంతేకాక, దీని తర్వాత కూడా జాన్వీ మరో తెలుగు ప్రాజెక్ట్‌లో నటించబోతోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇంతలో జాన్వీ కపూర్ చేసిన ఓ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన “సౌత్ హీరోల్లో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటావు?” అనే ప్రశ్నకు జాన్వీ కపూర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా “విజయ్ దేవరకొండ” అని సమాధానం ఇచ్చింది.
ఆ సమాధానం అప్పట్లో పెద్ద హంగామానే సృష్టించింది. సోషల్ మీడియాలో ఇద్దరి పేర్లను జతచేసి రకరకాల గాసిప్స్, రూమర్లు చక్కర్లు కొట్టాయి. కొందరు అయితే “విజయ్ – జాన్వీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందట” అంటూ పుకార్లు పుట్టించారు. అయితే, ఆ విషయం తర్వాత క్రమంగా మసకబారిపోయింది.కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో, జాన్వీ చెప్పిన ఆ కామెంట్ మళ్లీ వైరల్ అవుతూ సోషల్ మీడియాలో గబ్బు లేపుతోంది. ఆమె తన గ్లామర్‌తో పాటు నటనపైన కూడా దృష్టి పెట్టి, బాలీవుడ్‌కే కాకుండా సౌత్‌లో కూడా తనదైన స్థానం సంపాదించడానికి కృషి చేస్తోంది. ఆమె నటిస్తున్న తెలుగు సినిమాలు రిలీజ్ అయితే, టాలీవుడ్‌లో ఆమె స్థాయి మరింత పెరిగే అవకాశముంది.మొత్తానికి — విజయ్ దేవరకొండ పెళ్లి హడావుడి మధ్య జాన్వీ కపూర్ పాత కామెంట్ మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ, నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి