టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ముఖ్యంగా మా ఊరి పొలిమేర సినిమాతో భారీ క్రేజీ సంపాదించుకుంది. ఆ తర్వాత రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల హీరో అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ నాని కాసరగడ్డ తెరకెక్కించారు. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా నవంబర్ 21వ తేదీన థియేటర్లోకి రాబోతోంది.



ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కామాక్షి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాను ఇందులో నరేష్ కి జోడిగా ఆరాధన పాత్రలో నటించానని.. ఈ పాత్ర లేకపోతే ఈ సినిమా కథే లేదు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తన పాత్ర గుర్తు పెట్టుకుంటారని తెలిపింది. విజయ్ సేతుపతి, సుహాస్, శ్రీ విష్ణు వంటి చాలామంది హీరోలు రకరకాల పాత్రలు చేసి ఉంటారు. అలా హీరోయిన్స్ ఎందుకు చేయరని ఒక సవాల్ గా తీసుకొని మరి ఈ సినిమాలో ఆరాధన పాత్రలో నటించానని తెలిసింది.

ఇకనుంచి అన్ని విభిన్న రకరకాల పాత్రలలోనే నటించడానికి ప్రయత్నిస్తాను. ఇలా ఈ ఐదేళ్లు నా ప్రయాణంలో చేసిన పొలిమేర, విరూపాక్ష సినిమాలో తనకి మంచి పేరు తెచ్చి పెట్టాయని తెలిపింది. ప్రస్తుతం అడవి శేషు నటిస్తున్న డెకాయిట్ చిత్రంలో నటిస్తున్నాను , అలాగే మరో బడ ప్రాజెక్టులో కూడా భాగమయానని త్వరలో అందుకు సంబంధించి వివరాలను కూడా తెలియజేస్తానని తెలిపింది. వీటితో పాటుగా పొలిమేర 3 సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నానంటు తెలియజేసింది కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: