ఎన్నో కొత్త సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చిన పైరసీ కింగ్ ఇమ్మాడి రవి ని రీసెంట్గా పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఇమ్మాడి రవి ని అదుపులోకి తీసుకొని పోలీసులు ఎన్నో నిజాలు బయటికి లాగుతున్నారు. ఆయన అపార్ట్మెంట్లో ఉండే వందల మొబైల్ ఫోన్లు, లాప్ ట్యాప్ లు, మూడు కోట్ల నగదు ఇలా ఎన్నో లాక్కున్నారు.. ఒకప్పుడు ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ గా ఉన్న ఈయన ప్రస్తుతం పైరసీ కింగ్ గా మారి ఎలాంటి సర్వర్లనైనా సరే చాలా ఈజీగా హ్యాకింగ్ చేసే టెక్నాలజీని నేర్చుకొని కొత్త సినిమాలను పైరసీ చేసి ఇన్ని రోజులు కోట్లు సంపాదించాడు.

అంతేకాదు ఎప్పటికి నేను దొరకను అనే భ్రమలో ఉన్న ఇమ్మాడి రవి పోలీసులకే సవాల్ విసిరారు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నట్లు ఫైనల్ గా ఇమ్మాడి రవి పోలీసులకు దొరికిపోయాడు. అయితే పోలీసుల విచారణలో ఇమ్మాడి రవి సంచలన విషయాలు బయటపెట్టారు. ముందు అందరి కంటే ముందే కొత్త సినిమాలు చూడాలి అనే ఉద్దేశంతో ఈ హ్యాకింగ్ చేయడం మొదలుపెట్టానని, ఆ తర్వాత అది ఒక సరదాగా మారిపోయి కిక్కు కోసమే ఇలా చేశానని, డబ్బు సంపాదించడంతోపాటు కిక్కు వస్తుంది అనే ఉద్దేశంతో సినిమాలు పైరసీ చేశాను అంటూ సంచలన నిజాలు ఒప్పుకున్నారు ఐబొమ్మ రవి.

అంతేకాదు అలా సరదా కోసం స్టార్ట్ చేసిన ఈ హ్యాకింగ్ ప్రభుత్వ వెబ్సైట్లను కూడా హ్యాకింగ్ చేసే వరకు వెళ్లి దాదాపు కోట్లు సంపాదించారట. ఇప్పటివరకు ఐబొమ్మ రవికి 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నట్టు ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: