రాజమౌళి మహేష్ బాబు మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని గ్లోబల్ లెవెల్ లో ప్రమోట్ చేయడం కోసం టైటిల్ రివీల్,గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ఒక పెద్ద ఈవెంట్ ని చేశారు.అలా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో వారణాసి అనే టైటిల్ తో పాటు ఆ మూవీ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. అయితే తాజాగా వారణాసి గ్లింప్స్ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో కథలు కథలుగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే వారణాసి గ్లింప్స్ లో కనిపించిన కొన్ని అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారణాసి గ్లింప్స్ ని నిశితంగా గమనిస్తే.. మొదట ఆకాశంలో నుండి ఓ ఉల్క అంటార్కిటికా మంచు ప్రాంతంలో పడ్డప్పుడు దాని వెనకే ఉన్న పర్వతంపై కొంతమంది అలాగే ఆ కిందే నీటిపై ఉన్న చిన్న బోట్ లో ఇంకొంత మంది కనిపించారు. ఇక దీని సారాంశం ఏంటంటే.. పర్వతంలో ఏదో దాగి ఉంటే దాన్ని కనుక్కోవడానికి కింద కొంతమంది వచ్చినట్టు అర్థమవుతుంది.

 ఆ తర్వాత సెకండ్ లోనే మంచులో ఇరుక్కుపోయిన రెండు ముక్కల పడవ కూడా కనిపిస్తుంది. ఇక మరో షార్ట్ ఏంటంటే.. పారాచ్యూట్ ఎగిరేది.ఇది చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. ఆ తర్వాత నీటిలో ఉన్న నీటి ఏనుగుల గుంపు కి కొంచెం దూరంలో ఒడ్డు మీద కొంతమంది చేపలు పడుతున్నట్టు చూపించారు. అలాగే ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ కి లింక్ అయ్యేలా ఉగ్రబట్టి గుహ కనిపించింది. ఇక ఇందులో నిశితంగా గమనిస్తే ఆ గుహలో కొంతమంది గన్ పట్టుకొని ఉన్నారు. మరో వ్యక్తి కొండ చరియల అంచున నిలబడ్డాడు. అయితే ఆ కొండ చరియలు అంచును నిలబడింది మహేష్ బాబు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఉగ్రబట్టి గుహకి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ కి లింక్ ఉందని నెటిజన్స్ కనిపెట్టడంతో ఆ ఉగ్రబట్టి గుహకి ప్రియాంక చోప్రాని కాపాడడం కోసమే మహేష్ బాబు వెళ్తాడు అనే ప్రచారం జరుగుతుంది.ఇందులో ఎంత నిజం ఉందో ముందు ముందు తెలుస్తుంది.

 ఇక ఈ గ్లింప్స్ లో ఒక ముని తన పక్కనే కపాలాలు పెట్టుకొని యాగం చేస్తున్నట్టు చూపించారు. ఇక తర్వాత సీన్లో లంకా నగరం చూపించి హనుమంతుని తోకపై గుర్రపు బండి, ఆంజనేయుడి చేతిలో ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొని యుద్ధం చేస్తున్నట్టు చూపించారు. అలాగే వానర సైన్యంతో పాటు రాముడి  సన్నివేశం కూడా చూపించారు. ఆ తర్వాత వెనుక ఉన్న పర్వతాలన్నీ ఒకే షేపులో చూపించారు. ఆ తర్వాత రామబాణం నుండి బ్లూ కలర్ విజువల్ తో ఒక ట్రాన్సాక్షన్ ఆ తర్వాత మళ్లీ కథ వారణాసికి టర్న్ అవుతుంది. ఇక ఇక్కడ కాస్త నిశితంగా గమనిస్తే నీటి సుడిగుండంపైన కొన్ని తిరుగుతున్న చక్రాలు చూపించారు. అయితే ఇది టైం ట్రావెల్ పోర్టల్ లో తెరకెక్కుతున్న స్టోరీ అని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్లను వారణాసి గ్లింప్స్ లో రాజమౌళి చూపించారు. చూస్తుంటే రాజమౌళి వారణాసిలో మరెన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తారో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: