వరుస అపజయాలతో సత మతం అవుతున్న రామ్ తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో రామ్ కి జోడిగా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నవంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ కు కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాలను లభించింది. దానితో వరుస అపజయాలతో ఉన్న రామ్ "ఆంధ్ర కింగ్ తాలూకా" సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన రీతిలో కం బ్యాక్ ఇవ్వడం ఖాయం అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇలాంటి సమయం లోనే రామ్ అభిమానులను ఓ విషయం కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? ఈ సినిమా నవంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఇక డిసెంబర్ 5 వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ 2 మూవీ విడుదల కానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నవంబర్ 27 వ తేదీన విడుదల అయ్యి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి అద్భుతమైన టాక్ వచ్చినా కూడా డిసెంబర్ 5 వ తేదీన అఖండ 2 మూవీ విడుదల కానుండడంతో ఆ సినిమాకు పెద్ద ఎత్తున థియేటర్స్ వెళతాయి అని , దానితో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా థియేటర్లు తగ్గి , ఆ మూవీ కలెక్షన్లు తగ్గి అవకాశం ఉంటుంది అని వారు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: