టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్‌ విషయానికి వస్తే, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పేరు తప్పకుండా ముందుంటుంది.  ఆ పేరు చెప్తుంటేనే ఏవో తెలియని గూస్బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. తనకంటూ ప్రత్యేకమైన ఎనర్జీ, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, వరుసగా విభిన్న జానర్ల సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్, ప్రస్తుతం నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చుట్టూ భారీ హైప్ నెలకొంది. ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబంధించిన తాజా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రామ్ యాక్షన్, ఎమోషన్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మళ్లీ థియేటర్లలో గిరగిరా మోగించబోతున్నాడని ట్రైలర్ చూసిన వాళ్లంతా అంటున్నారు.
 

నవంబర్ 27న తెలుగుతో పాటు కన్నడ భాషల్లో కూడా గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించారు. కథ, నేపథ్యం, రామ్ లుక్—అన్ని కలిసి ఈసారి పక్కా మాస్, క్లాస్ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే సినిమా రాబోతుందనే ఫీలింగ్ క్రియేట్ చేశాయి.ఇక రామ్ వచ్చే సినిమాల లైనప్ విషయంలో కూడా కొత్త కొత్త రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన తాజా బజ్ ప్రకారం—టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై రామ్ ఒక భారీ చిత్రాన్ని చేయనున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన దర్శకుడు ఎవరు? కథ ఏ జానర్‌లో ఉంటుంది? స్కేల్ ఎంత పెద్దది? అనే విషయాల్లో మాత్రం అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. కేవలం టాక్‌ స్థాయిలో ఉన్నప్పటికీ, రామ్ – యువసుధ ఆర్ట్స్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే ఊహాగానాలు అభిమానుల్లో మంచి ఎక్సైట్మెంట్‌ కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా పాన్-ఇండియా సినిమాలు వరుసగా తెరకెక్కిస్తున్న ఈ బ్యానర్ రామ్‌తో చేయబోయే సినిమా కూడా పెద్ద స్కేల్‌లోనే ఉండబోతుందని చాలామంది అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి. అప్పటివరకు రామ్ అభిమానులంతా ‘ఆంధ్ర కింగ్’ రిలీజ్‌ కోసం కౌంట్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: