మెగాస్టార్ చిరంజీవి తరతరాలుగా తెలుగు సినిమా తిరుగులేని స్టార్ గా ఎందుకు కొనసాగుతున్నారో మరోసారి చూపించారు. తన లెజెండరీ వెస్ట్రన్-యాక్షన్ క్లాసిక్ కొదమ సింహం (1990) నుండి ఒక స్టిల్‌ను మెగాస్టార్ స్వయంగా 35 సంవత్సరాల తర్వాత అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఈ లుక్ అదిరిపోయింది. 90లలో జానర్, హీరోయిజాన్ని రీడిఫైన్ చేసిన తెలుగు సినిమాలో కొదమసింహం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు, చిరంజీవిని అదే లుక్‌లో చూడటం అభిమానులని మెస్మరైజ్ చేసింది. మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, సాటిలేని చరిస్మా దశాబ్దాల క్రితం ఉన్నట్లే నేడు కూడా అంతే పవర్ ఫుల్ గా వుంది.
ఈ ఐకానిక్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ 'కొదమ సింహం' నవంబర్ 21న గ్రాండ్ థియేట్రికల్ రీ-రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇది అభిమానులకు ఈ మ్యాజిక్‌ని మళ్లీ బిగ్ స్క్రీన్ పై ఆస్వాదించే అరుదైన అవకాశం. ఇది కేవలం నాస్టాల్జియా కాదు…సినిమా ప్రేమికులకు తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉన్న ఒక దిగ్గజం 35 సంవత్సరాల వేడుక. ఈ నవంబర్ 21న థియేటర్లలో మెగాస్టార్ టైమ్‌లెస్ ప్రెజెన్స్‌ని మరోసారి ఆస్వాదించండి. ఇక రమా ఫిలింస్ బ్యానర్ పై సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు కైకాల నాగేశ్వరరావు ఆ రోజుల్లోనే రు. 4 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కె. మురళీ మోహన్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి