మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... భాను భోగవరపు. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. బీన్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందించాడు. గతంలో రవితేజ హీరో గా రూపొందిన ధమాకా మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించగా ... ఆ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబో లో రూపొందుతున్న మాస్ జాతర మూవీ కూడా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది భావించారు. దానితో ఈ మూవీ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ మూవీ కి నైజాం ఏరియాలో దాదాపు 5.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దానితో ఇప్పటివరకు ఈ సినిమా నైజాం ఏరియాలో 4.25 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటితోటే ఈ మూవీ నైజాం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయినట్లయితే ఈ మూవీ 78% వరకు నైజాం ఏరియాలో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ రిగవరీ చేసినట్లు అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఈ మూవీ నైజాం ఏరియాలో దాదాపుగా 1.25 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt