నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలకడగా దూసుకెళ్తున్న స్టార్ హీరోల్లో అగ్రగామి. ఆయనకు ఉన్న క్రేజ్, మార్కెట్ రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ — ఇవన్నీ రోజు రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా బాలయ్య నటించిన ‘అఖండ 2’ సినిమా మరోసారి అతని స్టామినాను నిరూపించేలా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిగంతల క్రితమే విడుదలైన ట్రైలర్‌కి వచ్చిన స్పందన చూస్తే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో హైప్ ఉందో అంచనా వేసుకోవచ్చు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్‌లో బాలయ్యను ఎప్పుడూ చూడని లుక్‌లో, ప్రత్యేకంగా ఆఘోర అవతారంలో చూపించడం ప్రేక్షకులను సంచలనంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో చూపించిన పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, డైలాగులు, బాలయ్య ఎనర్జీ అన్నీ కలిసి సోషల్ మీడియాలో సునామీలా ట్రెండ్ అయ్యాయి.


విమర్శకులు కూడా ఈ సారి బాలయ్య నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆఘోర పాత్రలోని అతని నటనకు ఎప్పుడూ లేనంతగా ప్రశంసలు దక్కుతుండడం గమనార్హం. బాలయ్య డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ టైమింగ్ — అన్నీ కలిసి మరొకసారి మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలో ఈ సినిమా గురించి మరో పెద్ద వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే — ‘అఖండ 2’ కోసం బాలయ్య తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారా?’’ అన్న చర్చ.



బాలయ్య గతంలో నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాకు సుమారు 28 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఈసారి ‘అఖండ 2’ కోసం బాలయ్య రెమ్యూనరేషన్‌ను మరింత భారీగా పెంచారని తెలుస్తోంది. తాజా బజ్ ప్రకారం, బాలయ్య ఈ సినిమాకు ఏకంగా 38 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంటే గత హిట్ సినిమాల కంటే దాదాపు 10 కోట్లు ఎక్కువ.ఇంత భారీ మొత్తాన్ని బాలయ్య తీసుకోవడం ఆయన కెరీర్‌లో ఇదే మొదటిసారి కావడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ రికార్డ్ రెమ్యూనరేషన్ చూసి అభిమానులు మాత్రమే కాదు, పరిశ్రమలోని పలువురు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య మార్కెట్ రేంజ్ రోజురోజుకు ఎలా పెరుగుతోందో దీనితో మరోసారి స్పష్టమవుతోంది.  మొత్తం మీద అఖండ 2 కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, బాలయ్య కెరీర్ దిశను మారుస్తున్న మరో మైలురాయి లాంటిదిగా మారింది. ఈ సినిమా విడుదలై థియేటర్లలో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: