ఏంటి సమంత మోసగత్తెనా.. అసిస్టెంట్ డైరెక్టర్ తీయవలసిన సినిమాని తన దగ్గర సన్నిహితంగా ఉన్న దర్శకురాలికి అందించిందా..ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం.రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ హిట్ కొట్టిన తెలుసు కదా మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ,రాశి కన్నా, శ్రీనిధి శెట్టిలు హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ మూవీకి ఫస్ట్ టైం నీరజకోన దర్శకురాలిగా చేసింది. ఇన్ని రోజులు హెయిర్ స్టైలిస్ట్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న నీరజ కోన తెలుసు కదా మూవీతో దర్శకురాలిగా మారింది.అయితే ఈ సినిమా హిట్ కొట్టి నీరజ కోనకి మంచి గుర్తింపు లభించింది. కానీ ఈ సినిమా విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ఓ సంచలన విషయాన్ని బయట పెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్. 

తెలుసు కదా మూవీ నీరజకోన ది కాదు అని.. ఆ సినిమా నాది అని ఈ సినిమా స్టోరీని లీక్ చేసింది సమంతనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. సమంత కి సంబంధించిన కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చెప్పారంటే నేను తెలుసు కదా మూవీ ని ఫిమేల్ సెంట్రిక్ మూవీ గా తీయాలి అనుకున్నాను.అలా సమంత లేదా రష్మికను ఈ సినిమాలో పెట్టుకోవాలి అనుకున్నాను.ఆ తర్వాత ప్రొడ్యూసర్లకి,నితిన్, నాని, సమంత కి ఈ సినిమా స్టోరీని చెప్పాను. అలా సమంతకి కూడా ఈ స్టోరీ చెప్పాను.కానీ సమంత మాత్రం తన స్టోరీని నీరజ కోన దగ్గర లీక్ చేసింది.

ఎన్నో రోజులుగా నీరజ కొన సమంత దగ్గర మేకప్ అలాగే హెయిర్ స్టైలిస్ట్ గా వర్క్ చేస్తుంది.అలా నీరజ కోనకి తన స్టోరీ మొత్తం లీక్ చేసింది.దాంతో నీరజ కోన ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫిమేల్ సెంట్రిక్ మూవీని మేల్ సెంట్రిక్ మూవీ గా మార్చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్,నైట్రోజన్ అంటూ కొన్ని అంశాలు చేర్చిసినిమా స్టోరీ మొత్తాన్ని బలహీనపరిచింది అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ బాధపడ్డారు. అయితే రెడ్డిట్లో ప్రత్యక్షమైన ఈ పోస్టు సోషల్ మీడియా వరకు వ్యాపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజన్లు సమంత మరీ ఇంత మోసగత్తెనా..ఒక డైరెక్టర్ రాసుకున్న సినిమాని మరొకరికి అప్పగించి అంత పెద్ద తప్పు చేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన ఆరోపణల పై సమంత ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: