ఇక ఈ మూవీ కి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది . హీరో మరియు హీరోయిన్ కలిసి పిస్టల్ పట్టుకోగా ఆ పిస్టల్ పై గోవిందా నామాలు రెండు జీవితాలు మరియ ఒకటే ప్రయాణం రెండు చేతులు, ఒకటే ప్రమాణం రెండు మనసులు, ఒకటే వీధి, శ్రీనివాస మంగాపురం, ప్రేమ కథల లలో ఈ కథ కూడా ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుంది .. అని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు . ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది . ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ మరియు ఇతర అప్డేట్స్ అధికారికంగా ప్రకటన కానున్నాయి .
ఈ సినిమా కోసం జయకృష్ణ అటు యాక్టింగ్ మరియు డాన్స్ అదే విధంగా డైలాగ్ డెలివరీ ఇలా అన్నిటిలోనూ దర్శకుడు అజయ్ భూపతి దగ్గర నుండి మరి శిక్షణ తీసుకుంటున్నాడు . జయకృష్ణ తొలి సినిమా పర్ఫెక్ట్ గా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అజయ్ భూపతి . ఇక జయకృష్ణ సరసన హీరోయిన్గా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రవీనా కూతురు రష తడాని హీరోయిన్గా నటిస్తుంది . ప్రస్తుతం ఈ మూవీ పై మంచి హైట్ ఏర్పడింది . మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం జయకృష్ణ ఏ విధమైన పాపులారిటీ సంపాదించుకుంటాడో చూడాలి .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి