మంచు మనోజ్ కి మంచు విష్ణు కి మధ్య గత కొద్దిరోజుల నుండి అస్సలు పొసగడం లేదు.ఇద్దరి మధ్య ఎన్నో విభేదాలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా మోహన్ బాబు పేరుని ముందు పెడుతూ విష్ణు ఎన్నో అరాచకాలు చేస్తున్నారని,మనోజ్ ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో కూడా మనోజ్ వేరే వ్యక్తితో కలిసి అవకతవకలు చేశారని ఆరోపించారు.అయితే ఈ మనోజ్ చేసే ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో తెలియదు కానీ మోహన్ బాబు మాత్రం విష్ణువైపే ఉన్నారు . దీంతో మనోజ్ కి మోహన్ బాబు,విష్ణు తో గొడవలు మొదలయ్యాయి.మోహన్ బాబుతో మనోజ్ కి ఎలాంటి గొడవ లేకపోయినప్పటికీ మోహన్ బాబు మాత్రం ఇద్దరు కొడుకుల్లో పెద్దకొడుకు వైపే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ తండ్రికి పేరు తేవాలి కానీ పీక్కొని తినకూడదు అంటూ మంచు విష్ణు పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.మరి ఇంతకీ మనోజ్ ఏం మాట్లాడారు..అది విష్ణు గురించేనా అనేది ఇప్పుడు చూద్దాం..

 మనోజ్ రీసెంట్గా మిరాయ్ మూవీ హిట్ కొట్టాక ఎన్నో సినిమా ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు. అలా రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయి ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు. అయితే తాజాగా వానర మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ వానర మూవీ హీరోకి తన తండ్రి సపోర్ట్ చేసిన తీరు గురించి మాట్లాడుతూ.. ఈ హీరో తండ్రి పోలీస్ ఫీల్డ్ లో నుండి వచ్చారు. ఈ హీరో ఎంబీఏ చదివారు.కానీ ఎంబీఏ చదివి సినిమాల్లోకి వస్తానని చెప్పినా కూడా తండ్రి వద్దని చెప్పకుండా సపోర్ట్ చేశారు. తండ్రి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాడు. కానీ తండ్రి కోరికని కొడుకు తీరుస్తున్నాడు నిజంగా హాట్సాఫ్ అంటూ వానర మూవీ హీరో తండ్రిని మెచ్చుకున్నారు.అలాగే తన తండ్రి గురించి మాట్లాడుతూ.. రీసెంట్ గా మా నాన్న ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఫంక్షన్ ఒకటి జరిగింది.

ఆ ఫంక్షన్ రోజు నేను మోహనరాగ అనే కొత్త వెంచర్ ని స్టార్ట్ చేశాను.మా నాన్నకి నాకు మోహనరాగం అంటే చాలా ఇష్టం. అందుకే నాన్నకు ఎంతో ఇష్టమైన మోహనరాగ పేరు మీద మ్యూజిక్ వెంచర్ స్టార్ట్ చేశాను. ఏదైనా సరే ఎదిగాక తండ్రికి మనం ఇవ్వాలి. కానీ తండ్రి దగ్గరి నుండి పీక్కొని తినకూడదు. కొడుకు అనేవాడు పేరెంట్స్ కి తిరిగి ఇవ్వాలి కానీ వారిని ఇబ్బందులకు గురిచేసి పీక్కొని తినకూడదని నేను నమ్ముతాను..అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.అయితే మంచు మనోజ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ విష్ణుని ఉద్దేశించే మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారని,మనోజ్ తండ్రికి దూరంగా ఉన్నా కూడా తండ్రి పై ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు.. కానీ విష్ణు తండ్రి చెంతే ఉంటూ తనని పీక్కొని తింటున్నాడు అనే విధంగా మాట్లాడారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: