టికెట్ రేట్ల పెంపు వివరాలు:
తెలంగాణలో:
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలకు ₹50 పెంపు
మల్టీప్లెక్స్ థియేటర్లలో ₹100 పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో:
సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరలకు ₹75 పెంపు
మల్టీప్లెక్స్‌లలో ₹100 పెంపు
ఈ పెంపుకు సంబంధించిన అధికారిక జీవో త్వరలో విడుదల అవ్వనుంది. దీంతో అఖండ 2 రిలీజ్ రోజున థియేటర్లలో భారీ ఆదాయం నమోదయ్యే అవకాశం ఉంది.అలాగే డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్ షోల విషయానికి వస్తే, వాటి కోసం నిర్ణయించిన టికెట్ ధరలు ₹600 వరకు ఉండనున్నాయని సమాచారం. ఈ రేట్స్ చూసి నందమూరి అభిమానులు వెరీ రీజనబుల్ అంటున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం, బోయపాటి శ్రీను దర్శకత్వం, ధమన్ సంగీతం—అన్నీ కలిసి ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా మార్చనున్నాయి.ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో హైప్ మరింత పెరుగుతోంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్లు—ఒక్కొక్కటి సినిమాపై భారీ బజ్‌ను సృష్టిస్తున్నాయి. పాన్-ఇండియా రిలీజ్ కావడంతో బాలయ్య ఈసారి నార్త్ ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి