తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అజయ్ ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన ఓ సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అజయ్ మాట్లాడుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు గారు హీరోగా రూపొందిన పోకిరి అనే సినిమాలో ఓ పాత్ర చేశాను. ఇక ఆ పాత్రకు మీదట నన్ను కాకుండా రాజీవ్ కనకాల గారిని తీసుకోవాలి అని అనుకున్నారు. రాజీవ్ కనకాల అంతకు ముందే మహేష్ బాబు గారు హీరోగా రూపొందిన అతడు మూవీ లో నటించాడు. ఆ సినిమాలో రాజీవ్ కనకాల చేసిన పాత్ర చనిపోతుంది. ఇక పోకిరి సినిమాలో కూడా ఆయనను మొదట నా పాత్రకు అనుకున్నారు. కానీ పోకిరి సినిమాలో నేను చేసిన పాత్ర కూడా చనిపోతుంది.

దానితో అతడు సినిమాలో ఆయన పాత్ర చనిపోవడం , ఆ తర్వాత పోకిరి సినిమాలో కూడా అలాంటి పాత్రకే ఆయనను ఎంచుకోవడంతో , రెండు పాత్రల మధ్య సిమిలారిటీ ఉంటుంది అనే కారణంతో మహేష్ బాబు , రాజీవ్ కనకాల ను కాకుండా పోకిరి సినిమాలో నన్ను ఆ పాత్రకు రికమెండ్ చేశారు. దానితో రాజీవ్ కనకాల చేయాల్సిన పాత్రను నేను చేశాను అని అజయ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే పోకిరి సినిమాలోని అజయ్ పాత్రకు ఆ సమయంలో మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చాయి. పోకిరి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా ఇలియానా నటించగా ... డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: