నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీన ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణం గానే ఈ మూవీ బృందం వారు చాలా ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో మరియు రెగ్యులర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్లను కూడా ఓపెన్ చేశారు. ఈ మూవీ ని చూడాలి అనే ఉద్దేశం ఉన్న అనేకcమంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో మరియు రెగ్యులర్ షో లకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇక సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనకు సమయం అత్యంత దగ్గర పడిన టైం లో ఈ మూవీ ప్రీమియర్ షో లు రద్దు అయ్యాయి. ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన రెగ్యులర్ షో లతో ప్రేక్షకుల ముందుకు రానుంది అని వార్తలు వచ్చాయి. అప్పటికే డిసప్పాయింట్ అయిన బాలయ్య అభిమానులు ఇక ఆ తర్వాత ఈ మూవీ కొన్ని ఫైనాన్షియల్ కారణంగా ఆగిపోయింది.

సినిమా డిసెంబర్ 5 వ తేదీన కూడా విడుదల కావడం లేదు అని అధికారిక ప్రకటన రావడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నీరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన అడ్డంకులు అన్ని తొలగినట్లు , ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. డిసెంబర్ 12 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేస్తే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ నుండి పెద్ద పోటీ ఎదురవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అవతార్ 3 మూవీ ని డిసెంబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే బయట అవతార్ 3 మూవీ నుండి అఖండ 2 మూవీ కి అత్యంత భారీ పోటీ ఎదురవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: