సినిమా ఇండస్ట్రీ లో అందం , అభినయం ఉన్న కూడా కొంత మంది కి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కవు. ఇక మరి కొంత మంది కి అందం , అభినయం ఉండి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కిన కూడా ఆ సినిమాలు మంచి విజయాలను అందుకోకపోతే ఆ తర్వాత వారికి మంచి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కవు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించినా సరైన విజయాలు లేకపోవడంతో ఓ బ్యూటీ కెరియర్ తెలుగులో చాలా తక్కువ కాలం లోనే ముగిసి పోయింది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు కృతి కర్బంద. ఈమె చాలా కాలం క్రితం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈమెకు కెరియర్ ప్రారంభంలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తీన్ మార్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయినా కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. ఈ మూవీ తర్వాత ఈమె కెరియర్ చాలా స్లో అయింది. ఇకపోతే ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ కు అక్క పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి ప్రశంసలు దక్కిన కూడా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మూవీ తర్వాత ఈమెకు అవకాశాలు చాలా వరకు తెలుగు ఇండస్ట్రీ లో తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె పెద్దగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల జోరు కాస్త దగ్గర కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ లైట్ యెల్లో కలర్ డ్రెస్ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk