తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ చాలా సంవత్సరాల క్రితం పడియప్ప అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సౌందర్య , రమ్య కృష్ణ హీరోయిన్లుగా నటించగా ... కె ఎస్ రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో నరసింహ అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు బాక్సా ఫీస్ ల దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ లోని రజినీ కాంత్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లోని సౌందర్య నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే రమ్య కృష్ణ ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఈమె నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి  రమ్య కృష్ణ కెరియర్లోనే ఈ సినిమా లోని పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇకపోతే పడియప్ప మూవీ ని మరి కొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు.

ఇక రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు తమిళ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ బుకింగ్స్ లో ఈ మూవీ కి మొదటి రోజుకు గాను 25 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని , ఈ సినిమా రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: