టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. డైరెక్టర్ పి.మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీలకమైన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించారు. అలాగే రావు రమేష్, రాజీవ్ కనకాల, సింధుతులాని, మురళీ శర్మ, తులసి లాంటి వారు కూడా నటించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా నవంబర్ 27న థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. సినిమా  కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. 


సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్ సొంతం చేసుకుంది. క్రిస్మస్ స్పెషల్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన స్ట్రిమింగ్ కి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువబడునుంది.


సినిమా టైటిల్  గా ఆంధ్రా కింగ్ తాలూకా అని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆంధ్ర కింగ్ సూర్య పాత్రలో ఉపేంద్ర, హీరో అభిమానిగా రామ్ కూడా అద్భుతంగా నటించారు. భాగ్యశ్రీ  బోర్సే అందం, నటన, పాటలు ఈ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. సుమారుగా రూ.30 కోట్లకు పైగా ఈ సినిమా ఇప్పటివరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. సినిమా షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ మధ్య లవ్ రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. ఇవి కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి. మరి థియేటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా మరి ఓటీటి లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.హీరో రామ్ తదుపరిచిత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: