బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుడు షారుఖ్ ఖాన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మెగా మల్టీస్టారర్‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ ( YRF ) అధినేత ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వై.ఆర్.ఎఫ్. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘స్పై యూనివర్స్’ లోని తదుపరి భారీ చిత్రం ‘పఠాన్ 2’ లో ఎన్టీఆర్ ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ‘ పఠాన్ ’ ( షారుఖ్ ఖాన్ ) పాత్రను మరింత శక్తివంతంగా చేసేందుకు, కథను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఎన్టీఆర్‌ను సంప్రదించినట్లు సమాచారం.
అలాగే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్రపై ఇండస్ట్రీలో భిన్నమైన చర్చ నడుస్తోంది. ఇది కేవలం పఠాన్ పాత్రకు సమాంతర ప్రధాన పాత్ర ( Parallel Lead ) గా ఉంటుందా, లేక స్పై యూనివర్స్‌లోనే అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడిగా ( Formidable Antagonist ) ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి ఇదే స్పై యూనివర్స్‌లో ‘ వార్ 2 ’ చిత్రంలో నటించి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో, ‘పఠాన్ 2’లో కూడా భాగం అయితే ఈ చిత్రం మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం కమిటయిన ‘ కింగ్ ’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మెగా మల్టీస్టారర్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ అభిమానుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్టీఆర్ ఇప్పటికే హృతిక్ తో కలిసి చేసిన వార్ 2 అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం అవసరమా ? అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి