- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో రెండున్న‌ర దశాబ్దాల క్రింద‌ట విక్ట‌రీ వెంక‌టేష్ - ఆర్తీ అగ‌ర్వాల్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన నువ్వు నాకు న‌చ్చావ్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. త్రివిక్ర‌మ్ క‌థ‌, స్క్రీన్ ప్లే మాటల ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకు కె. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక వెన‌క ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌న ఉంది.  ‘నువ్వు నాకు నచ్చావ్‌!’ లో హీరోయిన్‌  ఎంపిక ఎంతకూ తేలడం లేదు. త్రిష... భూమిక… మాళవిక..  ఇలా చాలా ఆప్షన్స్ ఆలోచించారు. కానీ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు, ద‌ర్శ‌కుడు విజ‌య్ భాస్క‌ర్ వెంకీ ప‌క్క‌న ఫ్రెష్‌ ఫేస్‌ అయితేనే బాగుంటుందనుకున్నారు. ముంబయ్‌ వెళ్లి మోడల్‌ కో–ఆర్డినేటర్స్‌ దగ్గర చాలామంది అమ్మాయిల స్టిల్స్‌ చూశారు. అయితే అక్క‌డ ఒ ఫొటో లు చూస్తున్న‌ప్పుడు వాళ్లల్లో ఒకమ్మాయి నచ్చేసింది. అది కూడా ఓ సినిమా పోస్ట‌ర్ లో ఆ అమ్మాయి ఫేస్ చూసిన సురేష్ బాబు ఆమె కోసం ట్రై చేశారు.


అయితే ఆమె ఇక్క‌డ ఉండ‌డం లేదు.. అమెరికా లో ఉంటుంద‌ని తేలింది. ఆమె అప్ప‌టికే ‘పాగల్‌పన్‌’ అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా కూడా చేసింది. పేరు ఆర్తీ అగర్వాల్‌. కానీ ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంది. నో కాంటాక్ట్‌. మామూలుగా అయితే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేవారు. అయితే, ఆ పాత్ర ఆమెకే రాసిపెట్టినట్టుంది. అందుకే న్యూయార్క్‌లో ఆమె గురించి వేట మొదలైంది. సురేష్ బాబు త‌న ప‌రిచ‌యాల ద్వారా అమెరికా లో ఆమె ఎక్క‌డ ఉందో క‌నిపెట్టేశారు. ఆమె ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నారు. ఆమె త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడారు. చివరకు దొరికేసింది. ఆర్తి వచ్చీ రావడంతోనే షూటింగ్‌ స్టార్ట్ అయ్యింది. అలా తొలి సినిమా తోనే సూప‌ర్ హిట్ కొట్టిన ఆర్తీ నాలుగేళ్ల పాటు టాలీవుడ్ లో వ‌రుస‌గా అంద‌రి హీరోల‌తో న‌టిస్తూ ఓ వెలుగు వెలిగేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: