టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి అనుష్క కొంత కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. అనుష్క , క్రిష్ జాగర్లమూడి కాంబోలో చాలా కాలం క్రితం వేదం అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించడంతో ఘాటి సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ ను అందుకుంది. మరి ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? ఈ సినిమా ఎన్ని కోట్ల నష్టాలను అందుకొని ఈ సంవత్సరం ఫ్లాప్ మూవీ ల లిస్టు లో చేరిపోయింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 1.02 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 20 లక్షలు , ఆంధ్ర లో 80 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 2.02 కోట్ల షేర్ ... 4.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సిస్ లలో కలుపుకొని 45 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ఫైనల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 2.47 కోట్ల షేర్ ... 5.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ దాదాపు 25 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ మూవీ ఏకంగా 22.5 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకొని ఈ సంవత్సరం భారీ అపజయాలను అందుకున్న సినిమాల లిస్టు లో చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: