టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శ్రీకాంత్ మేక ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు శ్రీకాంత్ అనేక సినిమాలలో అనేక రకాల పాత్రలలో నటించాడు. అనేక సినిమాలో హీరో గా నటించి గొప్ప గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. శ్రీకాంత్ తనయుడు అయినటువంటి రోషన్ మేక కూడా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కొంత కాలం క్రితం నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రోషన్ ఆఖరుగా పెళ్లి సందD అనే సినిమా లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈయన ఛాంపియన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 7.80 మిలియన్ వ్యూస్ ... 160 లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను నిర్వహించారు. దానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. మరి ప్రస్తుతానికి ఛాంపియన్ మూవీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: