తోలిసారి టాలీవుడ్ కి హృదయ కాలేయం సినిమాతో హాస్య నటుడిగా పరిచయం అయి, మంచి పేరు సంపాదించిన సంపూర్ణేష్ బాబు, అక్కడినుండి పలు కామెడీ స్పూఫ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆయన హీరోగా రూపొందిన కొత్త సినిమా కొబ్బరిమట్ట సినిమా, మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఏకధాటిగా సింగిల్ టేక్ లో సంపూ పలికిన అతి పెద్ద డైలాగ్ కు సినిమా థియేటర్లలో విజిల్స్ మారు మ్రోగుతున్నాయి. 

ఇక పలు సినిమాల కలబోతగా రూపొందినప్పటికీ, కొబ్బరిమట్ట సినిమాలో సంపూ నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సంపూ పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో నటించి ఆడియన్స్ కు మరొకసారి గిలిగింతలు పెట్టిన ఈ సినిమా, ఇప్పటివరకు రూ.3.40 కోట్లవరకు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అయితే తమ సినిమా కలెక్షన్స్ విషయమై కొబ్బరిమట్ట యూనిట్ నేడు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆ పోస్టర్ లో మూడు రోజుల్లో రూ.12 కోట్ల కలెక్షన్లతో సంపూ ప్రభంజనం అని వేసి, ప్రక్కన ఒక స్టార్ మార్క్ ని పెట్టడం జరిగింది. అయితే అదే పోస్టర్ లో క్రింద వైపున అభిమానుల కోసం రూ.9 కోట్ల ఫేక్ కలెక్షన్ ని యాడ్ చేయడం జరిగింది అంటూ ఆ సినిమా యూనిట్ ఫన్నీగా చిన్న ట్విస్ట్ ఇచ్చింది. 

ఇక ఇప్పటికే పలు కేంద్రాల్లో మంచి కెలెక్షన్ సాధిస్తున్న తమ సినిమా, మున్ముందు మరింతగా విజయాన్ని అందుకోవాలని నేడు హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా విజయోత్సవ వేడుకలో సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో మంచి లాభాల బాట పట్టడం ఖాయమని అంటున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: