తెలుగువాడే అయినా చెన్నైలో సెటిల్ అవడం వల్ల విశాల్ తమిళ హీరోగానే పరిచయమయ్యాడు. తను చేసిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు విశాల్. పందెం కోడి సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి అయితే లేటెస్ట్ గా వచ్చిన అభిమన్యుడు మాత్రం విశాల్ కు పందెం కోడి హిట్ ఇచ్చింది.


పి.ఎస్ మిత్రన్ డైరక్షన్ లో సైబర్ క్రైం నేపథ్యంలో వచ్చిన సినిమా భైమన్యుడు. తమిళంలో ఆల్రెడీ ఇరుంబు తిరై రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ సక్సెస్ అందుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా విశాల్ సత్తా ఏంటో చూపించింది. తానే నిర్మాత కాబట్టి తెలుగులో సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు విశాల్.   


ఇక తన కెరియర్ లో తెలుగులో పందెం కోడి మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు దాని సరసన అభిమన్యుడు వచ్చి చేరింది. రెండు వారల్లో ఈ సినిమా 7.79 కోట్లను వసూళు చేసింది. డబ్బింగ్ ఖర్చులు మాత్రమే కాబట్టి ఈ సినిమా విశాల్ కు తెలుగులో మంచి లాభాలే తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. 


ఇక ఏరియాల వారిగా కలక్షన్స్ వివరాలు చూస్తే..  
నైజాం : 2.90 కోట్లు
సీడెడ్ : 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.33 కోట్లు
కృష్ణా : 0.68 కోట్లు
గుంటూర్ : 0.60కోట్లు
ఈస్ట్  : 0.65 కోట్లు
వెస్ట్ : 0.40 కోట్లు
నెల్లూరు : 0.33 కోట్లు
ఏపి/ తెలంగాణ మొత్తం : 7.79 కోట్లు    



మరింత సమాచారం తెలుసుకోండి: