తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. దానితో ప్రస్తుతం తెలుగు లో ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం నితిన్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు మూవీ లోను , వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు.

ఈ రెండు మూవీ ల షూటింగ్ కూడా ఏకధాటిగా జరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ రెండు మూవీ ల నుండి చిత్ర బృందాలు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ రెండు మూవీ బృందాలు కూడా ఈ సారి నితిన్ తో చాలా పెద్ద ప్రయోగాలను చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న తమ్ముడు మరియు రాబిన్ హుడ్ మూవీ ల కోసం దాదాపు మూవీ బృందాలు ఒక్కో మూవీ కి 70 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా నితిన్ పై 70 కోట్ల బడ్జెట్ అంటే కష్టమే అని , ఇప్పటి వరకు నితిన్ కెరియర్ లో 70 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లేవు. అలాంటి హీరోతో ఇంత ఖర్చు అంటే రిస్క్ చేస్తున్నారు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం నితిన్ కు కరెక్ట్ కంటెంట్ పడితే అవలీలగా 70 కోట్ల షేర్ కలెక్షన్ లను తీసుకురాగలడు. అలాగే డిజిటల్ , సాటిలైట్ , మ్యూజిక్ హక్కులతో మరింత రాబట్ట గలడు. దానితో ఈయనకు ఇది పెద్ద బడ్జెట్ కాదు అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: