
సింగపూర్ తెలుగు సమాజం(STS) సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్ఎస్టీ ఈ రక్తదాన శిబిరాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. చల్లా శ్రీప్రదయా ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్ జొన్నడుల, రతన్ కుమార్ కవుతూరు, సత్య సురిసెట్టి, రాజశేఖర్, రామరాజు మద్దుకూరి, నగేష్, రేణుక, నాగ కిషోర్ మోదుకూరు, శ్రీవిద్య తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదానం ఏర్పాటు చేసిన వారికి, సంస్థ సభ్యులకు ఎస్టీఎస్ ప్రెసిడెంట్ రంగ రవి కృతజ్ఞతలు తెలిపారు.