యూరప్ దేశాల్లో వైద్య సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూరప్ దేశాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు వైద్య సేవల విషయంలో చాలా మెరుగ్గా పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా లేని విధంగా వైద్య సేవలు యూరప్ దేశాల్లో అందుతున్నాయి అనే మాట వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా కారణంగా పరిస్థితి కాస్త మారింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి కూడా యూరప్ దేశాలు ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాయి.

సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది అనే చెప్పాలి. ఇటలీ సహా కొన్ని దేశాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక బ్రిటన్ లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ నేపధ్యంలో కొన్ని దేశాలు మన దేశం నుంచి సహా మరికొన్ని దేశాల నుంచి యూరప్ కి వైద్యులను దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది.  మన దేశంతో పాటుగా క్యూబా సహా కొన్ని దేశాల నుంచి వైద్యులను దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆఫర్లు ఇస్తున్నారు.

అంతే కాదు క్యూబా నుంచి మన దేశం నుంచి వైద్య పరికరాలను కూడా భారీగా దిగుమతి చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే చెప్పాలి. ఆయా దేశాల వైద్య ఆరోగ్య శాఖ కూడా విదేశీ వైద్యులను ప్రభుత్వ వైద్యులుగా నియమించాలీ అని భావిస్తున్నాయి. దీని కోసం అవసరం అనుకుంటే రూల్స్ అయినా సరే మార్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మన దేశానికి చెందిన వైద్యులను అక్కడి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: