మన దేశంలో వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు చాలా వరకు అంచనాలు ఉన్నాయి. వ్యాక్సిన్ ని ఎలా అందించాలి ఏంటీ అనే దానిపై కేంద్ర ప్రభుత్వం చాలా వరకు చర్యలు చేపడుతుంది. దేశ వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ని అందించడం అనేది ఒక సవాల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేశంలో  కరోనా తీవ్రత అదుపులోనే ఉన్నా సరే అది ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగానే ఉన్నా సరే కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అనేది తగ్గే అవకాశం కనపడటం లేదు.

ఈశాన్య, హిమాలయ, ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా పెరుగుతున్నాయి. అయితే మన దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రం చైనా, రష్యా సహకారం కోరే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.  నిపుణులను ఇండియా పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక కమిటీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కమిటీకి వైద్య నిపుణుల బృందం నాయకత్వం వహించే అవకాశం ఉంది అని అంటున్నారు. త్వరలోనే ఈ బృందం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.

అమెరికా నుంచి కూడా ఆరుగురు సభ్యులు రానున్నారు. నిల్వ నుంచి ప్రతీ ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మరి భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటీ అనేది చూడాలి.  ఇప్పటికే యూకే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చింది. త్వరలోనే మరికొన్ని దేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మన దేశం కూడా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది.  ఇప్పటికే సీరం దీని కోసం దరఖాస్తు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: