ముందు నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అమెరికా విషయంలో చాలా వరకు కూడా సానుకూలంగా ఉంటారు. అమెరికాలో స్థిరపడాలని చాలామందికి కోరికగా ఉంటుంది. అందుకే చాలామంది ఆస్తులను కూడా అమ్ముకుని అమెరికా వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో రకాలుగా కష్టపడి అమెరికా పంపించి ఉన్నత చదువులు చదివిస్తు ఉంటారు. డాక్టర్లు ఇంజనీర్లు ఇలా చాలా మంది అమెరికా వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు.

ఐటి రంగంలో చాలా మార్పులు రావడంతో మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అమెరికా లో   స్థిరపడిన పరిస్థితి మనం చూశాం. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత చాలామంది అమెరికా విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకున్న భారతీయులను ఇబ్బంది పడ్డారు. దీంతో చాలామంది అమెరికా వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఉండేది అనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

కొన్ని కొన్ని వీసాలలో మార్పులు చేయడానికి ఆ దేశ అధ్యక్షుడు సిద్ధం కావడంతో భారతీయులు ఎక్కువగా అమెరికా వైపు చూస్తున్నారు. అందులో ప్రధానంగా యూరప్ దేశాల వైపు చూసిన మన భారతీయులు ఇప్పుడు అమెరికా వైపు చూడటం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్లీ అమెరికా వెళ్లి చదువుకోవాలి అనే కోరికలు బలపడుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాలకు వెళ్లి చదువుకునే వాళ్లకు కొన్ని ప్రోత్సాహకాలు అందించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేద విద్యార్థులకు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అమెరికా వెళ్లి మళ్లీ చదవడానికి సిద్ధపడుతున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు కూడా భారీగా పెరుగుతున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: