ఏ ప్రధానమంత్రి కూడా ఇప్పటివరకు భారతదేశంలో విదేశీ పర్యటనల విషయంలో ఇంత ఖర్చు కూడా చేయలేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా ఎక్కువగా విదేశీ పర్యటనల్లో ఉంటూ ఆయా దేశాల తో మాట్లాడుతూ కొన్ని కొన్ని చిన్న చిన్న ఒప్పందాలు చేసుకుంటూ అమెరికా సహా కొన్ని దేశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధానమంత్రి ముందుకు వెళ్ళారు. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం విషయానికి వచ్చేసరికి కూడా ప్రధానమంత్రి మోడీ విదేశాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నేపాల్ కోసం దాదాపుగా 15 వేల కోట్ల సహాయం అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేశారు. ఇప్పుడు మన దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నా సరే విదేశాలకు పంపడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో కూడా తీవ్ర ఆగ్రహంగా ఉంది. ప్రధానమంత్రి మోడీ ని దేవుడుగా చూసే ఉత్తరాది జిల్లాల్లో కూడా ఇప్పుడు ఆయనపై అసహనం పెరుగుతుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మోడీ ఇప్పటికైనా సరే జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని కొంతమంది హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి