
అయితే రోజులు గడిచిపోతున్నాయి తప్ప ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని అంగీకరించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అసలు తాలిబన్ల ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వం గానే గుర్తించడం లేదని చెబుతున్నాయ్. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన నిధులు ఇతర దేశాలలో ఉండడంతో ఆ నిధులు కూడా తాలిబన్లకు ఇచ్చేందుకు ఆయా దేశాలు అంగీకరించక పోవడం గమనార్హం. దీంతో ఆఫ్ఘనిస్థాన్లో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం ఆహార సంక్షోభం పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమకు తిరుగులేదు అని నిరూపించుకోవాలని అనుకున్న తాలిబన్లకు అడుగడుగునా షాకులు ఎదురవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల తాలిబన్లు
ప్రధాని మహమ్మద్ హన్ అఖుంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం ముస్లిం దేశాలైన తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలి అంటూ ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని విన్నవించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది . ప్రపంచ దేశాలు గుర్తించటం లేదని ఇప్పటికైనా ముస్లిం దేశాలైన గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలి అంటూ ఏకంగా తాలిబన్ల ప్రధాని కోరడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక రానున్న రోజుల్లో ముస్లిం దేశాలు తాలిబన్ల ప్రభుత్వం రిక్వెస్ట్ పై ఎలా స్పందించ పోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.