ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు.. ప్రస్తుతం అగ్ర దేశంగా కొనసాగుతున్న అమెరికాను వెనక్కి నెట్టెందుకు చైనా దొడ్డిదారిలో వెళ్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు తయారుచేసిన వస్తువులను డూప్లికేట్ లో తయారు చేస్తూ ఇక మార్కెట్లో హవా నడిపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇక ప్రకృతి వైపరీత్యాల గురించి పట్టించుకోకుండా ఎన్నో పెద్దపెద్ద బ్యారేజీలు నిర్మించటం చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే గత కొంత కాలం నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా అటు చైనాలో తీవ్ర సంక్షోభం పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిసింది.  చైనా లో ఏర్పడిన తీవ్రమైన రియల్ఎస్టేట్ సంక్షోభం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడుతుంది.


 ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలనుకున్న చైనాకు  అడుగడుగునా షాక్ లు తగులుతునే ఉన్నాయి. సంక్షోభం కారణంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది చైనా. ఈ క్రమంలోనే చైనాలో నెలకొన్న పరిస్థితులు తెరమీదికి వస్తూ ఉంటే ఇక ఇది చూసి అటు ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా కోట్ల విలువ చేసే ఆస్తులు సైతం ఖాళీగా పడిపోతుంది అనే చెప్పాలి. దీంతో ఇటీవల చైనా లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.


 ఏకంగా చైనాలో ఉన్న రైతుల దగ్గర్నుంచి డబ్బులకు బదులు గా పుచ్చకాయలు పీచెస్ గోధుమలు వెల్లుల్లి లాంటి వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా ఇళ్లు ఫ్లాట్ లను విక్రయిస్తున్నాయి అన్నది తెలుస్తుంది. 5 వేల కేజీల పుచ్చకాయల కు లక్ష్యము యువన్ల విలువ లెక్కగడుతున్నారట. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా  రియల్ ఎస్టేట్ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాలిస్తే ఇక చైనా ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: