ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి స్మార్ట్ఫోన్ అరచేతిలోనే ఉన్నా కారణంగా ఇక అరచేతిలోనే ప్రపంచాన్ని మొత్తం చూసేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారూ. ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో కొన్ని విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.  ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే అని చెప్పాలి


 ఘటన గురించి తెలిసిన తర్వాత ఇది నిజమా అబద్దమా అని ఎవరు నమ్మలేకుండా పోతున్నారూ అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాదరణంగా మనకు ఏదైనా ప్రాణాపాయం ఉంది అని తెలిసినప్పుడు.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. లేదంటే ఎమర్జెన్సీ కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఇలా ఎంతోమంది ఎమర్జెన్సీ కాల్స్ చేసి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వారు ఉన్నారు. కానీ సమాధి నుంచి ఎమర్జెన్సీ కాల్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. సమాధి నుంచి కాల్ చేయడం ఏంటి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారు కదా.

 ఇలాంటి వింతైన ఘటన ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగింది అని చెప్పాలి. చాయ్ కియోంగ్ ఆన్ అనే వ్యక్తి భార్య రిటైర్మెంట్ డబ్బు పొందేందుకు ఆమె బతికుండగానే చివరికి సమాధి చేసేసాడు. డబ్బు కోసం భార్యని దారుణంగా కత్తితో పొడిచి ఇక కాళ్లు చేతులు టేపుతో కట్టేసి ఒక బాక్స్ లో పడేస్తాడు. ఇక వెంటనే ఆ బాక్స్ ను కారులో తీసుకువెళ్లి మూడు అడుగుల గోతిలో పాతేశాడు అని చెప్పాలి. ఇక ఇలా పాతిపెట్టిన కాసేపటికే సదరు మహిళా కు స్పృహ వచ్చి తన చేతికి ఉన్న ఆపిల్ వాచ్ కారణంగా ఎమర్జెన్సీ కాల్ చేసి తన ప్రాణాలను కాపాడుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: