సాధారణంగా కవలలకు ఎంత దగ్గర పోలికలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నిమిషాల గ్యాప్ లో ఇలా కవలలు ఒకేసారి పుడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కవలలుగా పుట్టిన వారు రూపురేఖలు మొత్తం ఒకే విధంగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఈ అక్క చెల్లి ఎవరు అన్న తమ్ముడు ఎవరు అన్నది కూడా గుర్తించలేని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. అంతలా ఒకరు మరొకరికి జిరాక్స్ కాపీలా ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ట్విన్స్ అంటే ఇలా ఒకేలా ఉండే వారిని మాత్రమే చూసాము. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు వాళ్ళిద్దరూ కవలలు.. కానీ వారిని చూస్తే మాత్రం వారికి ఒకరితో ఒకరు ఒకేఒకరికి అస్సలు పోలిక ఉండదు అని చెప్పాలి.


 ఇక వారిని చూసిన తర్వాత వారిద్దరూ కవలలు అంటే నమ్మడం కూడా కాస్త కష్టమే. అయితే ఇలాంటి తేడానే ఇక ఇప్పుడు వారిని అందరికంటే ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరి మధ్య పోలికలు లేకపోవడంతో ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సాధించారు ఈ కవలలు. జపాన్లో ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  ఒకాయామాకు చెందిన యేసీ, మీషి అనే ఇద్దరు అమ్మాయిలు కూడా కవలలు. ఇక వారి వయస్సు ప్రస్తుతం 33 ఏళ్లు కావడం గమనార్హం. అయితే కవలలు అయినప్పటికీ వీరి రూపురేఖలు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఎత్తు పరంగా వారికి చాలా తేడా ఉంది.


 యెషి అనే మహిళ 162.5 సెంటీమీటర్లు అంటే ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉండగా.. మీషి మాత్రం 87.5 సెంటీమీటర్లు ఉంది అంటే రెండు అడుగుల 10 అంగుళాలు మాత్రమే. ఇక ఇలాంటి తేడానే ఇప్పుడు గిన్నిస్ బుక్ లో ఇద్దరు ట్విన్స్ రికార్డు సృష్టించేలా చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్న కవలల ఎత్తులో ఇదే అత్యధిక వ్యాత్యాసం కావడం గమనార్హం. వీరిద్దరి మధ్య 75 సెంటీమీటర్ల తేడా ఉంది అని చెప్పాలి. ఎముక భాగానికి వచ్చిన రుగ్మత వల్ల మిషీ సాధరణ వ్యక్తుల్లా ఎదగలేకపోయింది.  కాగా మొదట్లో నా ఎత్తు చూసుకొని నేను బాధపడేదాన్ని.. కానీ 2012లో నేను అతి తక్కువ ఎత్తు ఉన్న వ్యక్తి గురించి చదివి ఆశ్చర్యపోయాను అంటూ మిషి చెప్పుకొచ్చింది. అందరికంటే పొట్టిగా ఉండటమే అతని ప్రత్యేకత అని సదరు వ్యక్తి భావించేవాడు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: