ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రపంచం మొత్తం పాకిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఒకే విధంగా అందుబాటులో ఉంటుంది. దీంతో ఇక ఎక్కడో ప్రపంచంలో నలుమూలల్లో జరిగిన విషయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు చాలామంది. దీంతో చాలా విషయాలు ప్రతి రోజు ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా అనే మాయలో మునిగి తేలుతున్న మనిషి.. వెలుగులోకి వచ్చే అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే కొన్ని చిత్ర విచిత్రమైన ఘటనల గురించి తెలిసి ఏకంగా మనిషి ఆశ్చర్యం లో మునిగిపోతున్నాడు అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని ప్రతి ఒకరు కూడా అవాక్కయ్యే విషయాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా మనిషి బ్రతికున్నాడు అని తెలుసుకోవడానికి ప్రతి డాక్టర్ కూడా మనిషి యొక్క పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ పల్స్ లేదు అంటే మనిషి చనిపోయాడు అంటూ చెప్పేస్తూ ఉంటాడు.


 కానీ పల్స్ లేకుండానే మనిషి బ్రతుకుతాడా అంటే నమ్ముతారా పల్స్ లేకుండా బ్రతకడం ఏంటి అంటారు అందరూ. కానీ అమెరికాలోని మసాచూసెట్స్ కి చెందిన ప్రముఖ టిక్ టాకర్ సోఫియా హార్ట్ అనే 30 ఏళ్ల మహిళా మాత్రం ఇలా పల్స్ లేకుండానే బ్రతుకుతుంది. ఆమె అరుదైన వ్యాధితో పోరాడుతుంది. ఆమెకు డైలేటెడ్ కార్డియో మయోపతి అనే గుండె కండరాల రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ అయింది. సోఫియాకి ప్రస్తుతం పల్స్ లేదు. లెఫ్ట్ వెండర్క్యులర్ అసిస్ట్ డివైస్ పై ఆధారపడి ఆమె జీవిస్తున్నారు. ప్రస్తుతం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. అయితే పల్స్ లేకపోయినప్పటికీ కేవలం బ్యాటరీల మీద ఆధారపడి ఆమె జీవిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri