రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉంది.  అయితే ఎంతో మంది సైనికులు మాత్రమే కాదు సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయిన అటు యుద్ధం మాత్రం ఆగడం లేదు. అయితే ప్రపంచ దేశాలు కల్పించుకొని రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ రెండు దేశాల యుద్ధ విరమణ కోసం ఎన్నో సార్లు చర్చలు జరిగిన.. విఫలం అవుతూనే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఈ రెండు దేశాల మధ్య అసలు యుద్ధం ఆగుతుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశం గా మారి పోయింది అని చెప్పాలి  అయితే చిన్న దేశం అయినప్పటికీ ఉక్రెయిన్ మాత్రం యూరోపియన్ యూనియన్, అమెరికా లాంటి దేశాల సహాయం తో ఇక ప్రపంచం లోనే అతి పటిష్టమైన ఆయుధ వ్యవస్థను కలిగిన రష్యా లాంటి దేశం తో నిలబడి పోరాడ గలుగుతుంది అని చెప్పాలి. అయినప్పటికీ రష్యా దాటికి తట్టుకోలేక పోతుంది. అయితే ఈ రెండు సంవత్సరాల యుద్ధం లో దాదాపు మూడు లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు యుద్ధం లో చనిపోయారు అంటూ ఇటీవల రష్యా ప్రచార చేస్తోంది. ఇది కాస్త సంచలనగా మారి పోయింది అని చెప్పాలి. కాగా ఇటీవల ఇదే విషయం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి స్పందిస్తూ అసలు విషయాలు చెప్పుకొచ్చాడు  రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 31 వేల మంది సైనికులు మాత్రమే మరణించినట్లు జెలెన్ స్కి చెప్పుకొచ్చాడు. రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా మూడు లక్షల మంది చనిపోలేదు అంటూ స్పష్టతను ఇచ్చారు. గాయపడిన కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను రహస్యంగా ఉంచుతామని.. వారి వివరాలను వెల్లడించబోము అంటూ స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: