ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపి అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండూ కూడా స్నేహం చేస్తున్నాయనే వ్యాఖ్యలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు స్నేహం చేయడం వలన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయనే వ్యాఖ్యలు చాలామంది చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి భారతీయ జనతా పార్టీ అవసరం ఎక్కువగా ఉంది. అధికార వైసిపికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఎక్కువగానే ఉంది.

పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారతీయ జనతా పార్టీ నేతలతో వ్యక్తిగత అవసరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగానే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బిజెపి నేతలు ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. అంతే కాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విషయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

పార్లమెంటులో కూడా కొన్ని అంశాలలో భారతీయ జనతా పార్టీకి బడ్జెట్ సమావేశాల్లో అధికార వైసిపి సహకరించలేదనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపించాయి. దీంతో బిజెపి నేతలకు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ భారతీయ జనతా పార్టీ విషయంలో పెద్దగా భయపడే అవకాశాలు కూడా లేకపోవచ్చు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. బిజెపి వలన తనకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డి బిజెపిని తిడుతున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: