ఎంపీ రఘురామ గత కొద్దికాలంగా చేసిన యుద్ధం ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. మీడియా అడ్డుపెట్టుకుని కూడా ఆయన చేసిన యుద్ధం ఏ కొద్ది పాటి ప్రభావం కూడా చూపలేదు. తెరవెనుక శక్తుల సాయంతో జగన్ ను తిట్టిపోస్తున్న నరసాపురం ఎంపీ ఇప్పుడు మళ్లీ డైలమాలో పడ్డారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనలో నిజం లేదని తేలిపోయింది. సీబీఐ కోర్టులో కానీ మరో చోట కానీ ఆయన చెప్పేది ఇదే. ఇందుకు ఆధారాలు తీసుకురాలేనంత కాలం ఆర్ఆర్ఆర్ వాదన అయితే నెగ్గదు. కానీ పోరాటంలో వెన్నుచూపని నైజంలో ఆర్ఆర్ఆర్ గెలిచారు.



జగన్ తప్పు చేశారా లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. ఆ క్రమంలో విచారణ కూడా జరుగుతుంది. కొన్ని ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ కు, వైసీపీకి మధ్య విభేదాలు వచ్చాయి. ఆయనకు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థలను ఆదుకోవాలన్న ప్రతిపాదన ఒకటి జగన్ వరకూ వెళ్లింది. కానీ ఇందుకు జగన్ నో చెప్పారు. అప్పటి నుంచి తగువు పెంచుకునే పనే చేశారు. తనకు చెందిన కొన్ని పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలుచేయాలని జగన్ ను కోరారని, అందుకు ససేమీరా అనడంతోనే తగువు పెరిగిపోయిందని  కొందరు చెప్పే మాట.అయితే ఈ వివాదంలో వాస్తవం లేదని ఎంపీ అంటున్నారు.



ఏదేమైనప్పటికీ తగువు తీరు ఎలా ఉన్నా సీఎంపై పోరాడడంలో ఆర్ఆర్ఆర్ అస్సలు వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయంలో ఆయన కోర్టుల చుట్టూ పదే పదే తిరుగుతున్నారు కానీ  ఓటమిని మాత్రం అంగీకరించడం లేదు. అక్రమాస్తుల కేసు విషయమై సీఎం బెయిల్ రద్దు చేయాలని చేస్తున్న పోరాటం కూడా ఇకపై సాగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా తాను హైకోర్టుకు ఇంకా వీలుంటే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయనున్నానని చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటన్నది తేలిపోయింది.



చాలా రోజుల నుంచి జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి నరసాపురం ఎంపీ రఘు రామ రాజు పోరాడుతున్నారు. సీఎం బెయి ల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎంతో పాటు ఈ కేసులో మరో నిందితుడు సాయి రెడ్డి బెయి ల్ కూడా రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. దీంతో సాయిరెడ్డి కూడా తీవ్రంగానే ఆర్.ఆర్.ఆర్ పై స్పందించారు. బ్యాం కులకు ఉద్దేశపూర్వక రుణాల ఎగవేత దారుగా ఆర్.ఆర్.ఆర్ కు పేరుందని పేర్కొంటూ వైసీపీ వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపిం ది. తాజా గా సీఎం బెయిల్ ను రద్దు చేయాలని ఆర్.ఆర్.ఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు రద్దు చేయడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: